
కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును ఈ నెల 30న వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే తన పెళ్ళికి సంబంధించిన న్యూస్ ను బయటకు రివీల్ చేశారు. కరోనా పరిస్థితుల కారణంగా కాజల్ అగర్వాల్ తన పెళ్లిని దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పెళ్లి కాజల్ అగర్వాల్ ఇంట్లోనే జరగనుంది. ఇరువైపుల నుండి కేవలం 20 మంది మాత్రమే పెళ్ళికి హాజారు అవుతున్నారు. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తాము ఉండనున్న కొత్త ఇంటిని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. కాజల్ తన ఇన్స్టాలో ఈ విషయాన్ని స్టేటస్ రూపంలో తెలియజేశారు. "మా కొత్త ఇంటిని సెట్ చేస్తున్నాం. ఏమైనా సలహాలు ఇస్తారా" అని కాజల్ తన పోస్ట్ లో వారి ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అప్లోడ్ చేసిన పిక్ లో గౌతమ్ కూడా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలను యధావిధిగా కొనసాగిస్తానని తెలిపింది కాజల్. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రంలో కూడా కాజల్ కీలక పాత్రను పోషిస్తోంది.