"కంగనా" మళ్ళీ @ ఫైర్

"సుశాంత్ సింగ్ రాజ్ పుత్" మృతి విషయంలో
నెపొటిజంకు వ్యతిరేకంగా గళం విప్పి బాలీవుడ్ ప్రముఖులకి షాక్ ఇచ్చిన భామ "కంగనా రనౌత్" బాలీవుడ్ లోని కొందరిని మాఫియా అంటూ సంభోదిస్తూ కల్లోలం సృష్టించింది.
బాలీవుడ్ కి నిదురలేకుండా చేస్తుంది.
సెప్టెంబర్ 9న ముంబయికి వచ్చిన కంగనాకీ
కేంద్రహోంశాఖ వై ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.
ఈ వ్యవహారంపై వస్తున్న విమర్శలకు తనదైన శైలి లో కౌంటర్ ఇచ్చింది "కంగనా"

గతంలో ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తలపిస్తుంది అంటూ కంగనా వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలపై శివసేన పార్టీ మండిపడింది "కంగనా" ని ముంబైలో అడుగుపెట్టినిచ్చేది లేదంటూ హెచ్చరించింది.
దానికి కౌంటర్ గా "కంగనా" నేను ఫలానా తేదీన వస్తున్నానని దమ్ముంటే ఆపుకోండి అని ఘాటైన సమాధానం ఇచ్చింది.
ఇన్ని ఉద్రిక్తతల నడుమ ఆమె సెప్టెంబర్ 9 న ముంబై లో అడుగుపెట్టింది ఈ ఉద్రిక్తలు గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకి వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ని అరేంజ్ చేసింది. రాజకీయంగా కూడా దీనిపై  విమర్శలు వెల్లువెత్తాయి.

దీనికి కూడా "కంగనా" సమాధానం ఇస్తూ...
వైప్లస్ సెక్యూరిటీ ఎప్పుడు ఏ సందర్భంలో ప్రభుత్వం సమకూరుస్తోందో స్పష్టం చేసింది.
కేంద్రప్రభుత్వం మీరు చెప్పినట్టు నడుచుకోదు. నాకు భద్రత కల్పించింది కేంద్ర హోంశాఖ. ప్రభుత్వం వద్ద ఉన్న మార్గదర్శకాలని బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఇంటలిజెన్స్ వాళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగానే భద్రతను కల్పిస్తారు. ఒకవేళ నాకు భద్రత అవసరం లేదని కేంద్రం భావిస్తే వెనక్కి తీసుకుంటుంది. అంతే గానీ మీరు అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించకండి అంటూ "కంగనా" ఫైర్  కౌంటర్ ఇచ్చింది.
తర్వాత కంగనా ముంబై నుండి హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.