ఇండియా వైడ్ హీరోయిన్లలో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్ సుశాంత్ మృతి విషయంలో నెపొటిజంకు వ్యతిరేకంగా గళం విప్పి బాలీవుడ్ ప్రముఖులకి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లోని కొందరిని మాఫియా అంటూ సంభోదిస్తూ కల్లోలం సృష్టించింది.
మానసికంగా ఆమెని ఎంతమంది టార్గెట్ చేసినా. ఈ ఫైర్ బ్రాండ్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు.
తనదైన శైలిలో కొంతమంది రాజకీయనాయకులని కూడా వదిలిపెట్టలేదు. ఆమె ధైర్యమే ఆమెని ఫైర్ బ్రాండ్ ని చేసిందని అంటారు.
ప్రస్తుతం మనాలిలో ఉంటున్న ఈ ఫైర్ బ్రాండ్ ని కొందరు ముంబయికి రానిచ్చేది లేదు అంటూ
ఆమెని ముంబయిలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు.
వాళ్ళకి కంగనా హాట్ కౌంటర్ ఇచ్చేసింది.
ప్లేస్ నేనే చెప్తా...టైమ్ నేనే చెప్తా...రండి
ఎవడి అబ్బకైనా దమ్ముంటే... ఆపండి. సెప్టెంబర్ 9న ముంబయి ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నాను అని తన స్టైల్లో జవాబిచ్చింది.
బాలీవుడ్ బాద్షాలకీ, సోషల్ మీడియాలో తనని విమర్శించే వారికి ఒక హీరోయిన్ ఇలా ఛాలెంజ్ విసరడం ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రస్తుతం నెపొటిజంపై జరుగుతున్న ట్రోల్స్ ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.