
తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ అభినందన సభ
ఈ నెల 4 వ తేదీన హైదరాబాద్ లోని సి-24, రోడ్ నెంబర్-8, ఫేజ్-1, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ లోని తన స్వగృహంలో సినీ నిర్మాత& షోటోకాన్ గ్రాండ్ మాస్టర్ C. రాజు గారి ఆధ్వర్యంలో అభినందన సభ జరగబోతోంది. కరాటే చరిత్రలోనే ఈ కరోన సమయంలో తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాల్లో పర్యటించి అన్ని జిల్లాలకు పూర్తి కమిటీలను ప్రకటించి అన్ని అసోసియేషన్లకు ఆదర్శంగా నిలిచి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన (కాయ్) తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ అధ్యక్షులు పురం. వేంకటేశం, ప్రధాన కార్యదర్శి E.శ్రీనివాస్, కోశాధికారి V.నరేందర్ గార్ల శ్రమను గుర్తించి రాష్ట్ర కమిటీ వారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాయ్ రాష్ట్ర కమిటీ వారు (కాయ్) తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ చీఫ్ ప్యాట్రన్ గా ఎన్నికైన C. రాజు గారిని ఘనంగా సన్మానించాలని వారు తెలిపారు. C.రాజు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని సీనియర్ మాస్టర్లందరిని కలుపుకుని వారి సలహాలు సూచనలు స్వీకరించి కరాటే క్రీడ, క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. అలాగే కరాటే క్రీడకు ఉన్నంత క్రేజ్ మరే క్రీడకు లేదని దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే కరాటే క్రీడాకారులకు స్పోర్ట్స్ కోట క్రింద 2% విధ్యారంగంలో సీట్లను, ప్రభుత్వ ఉద్యోగాలను పొందేలా కృషి చేయాలని ఆయన సూచించారు. అలాగే అన్నీ కరాటే అసోసియేషన్ లు ఒక్క త్రాటి పై నిలిచి కరాటే క్రీడా రంగం కోసం, క్రీడాకారుల భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు. అలాగె 4వ తేదీన జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ గారు, యువ సినీ హీరో విశ్వక్ సేన్ గారు హాజరు అవుతారని, అలాగే ఈ కార్యక్రమానికి (కాయ్) రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ మాస్టర్లు , కరాటే క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అభినందన సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమం అనంతరం వచ్చే అతిథులందరికీ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.