
ప్రారంభ వీడియోని షేర్ చేసిన అల్లు అర్జున్
హైదరాబాద్ లో ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయా స్టూడియోస్, సారథి స్టూడియోస్ ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన మరో అద్భుతమైన స్టూడియో అందుబాటులోకి రానుంది. అదే 'అల్లు స్టూడియోస్' ఇటీవల 'పద్మశ్రీ' అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి ఆయన పేరుతో ఓ స్టూడియోని నిర్మించబోతున్నామంటూ ప్రకటించారు.
దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, అల్లు శిరిష్, అల్లు అరవింద్, అల్లు వెంకటేష్ తో పాటు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతవరకు హైదరాబాద్ స్టూడియోలలో లేని హంగులతో, సదుపాయాలతో సినిమాలకి, టీవీ నాటికలకి, రియాలిటీ షోస్ కి అనువుగా ఉండే విధంగా 'అల్లు స్టూడియోస్' ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.