
‘అందాల రాక్షసి’ చిత్రంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించారు లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత నాని, శర్వానంద్, అక్కినేని నాగార్జున వంటి హీరోల సరసన నాయికగా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆవిడ కార్తీకేయతో కలిసి ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆవిడ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, డీ గ్లామర్ లుక్ తో ఉన్న తన ఫోటోని షేర్ చేశారు. మీట్ మల్లిక అంటూ ఆ చిత్రంలోని తన క్యారెక్టర్ ను రివీల్ చేశారు. బస్తీ బాలరాజు పాత్రలో హీరో కార్తీకేయ నటిస్తున్నారు. ఆయన పోషించిన ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్ సైతం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ అందుకుంది. హీరో పుట్టిన రోజున చిత్ర బృందం విడుదల చేసిన ‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి స్పందన పొందింది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కీలక సన్నివేశాలకు సంబధించిన షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఇక త్వరలోనే నూతన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్మాత బన్నీ వాసు తెలిపారు. చిత్ర కథనాయకుడైన కార్తీకేయ, లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసిన మల్లిక ఫోటోను షేర్ చేస్తూ “ అయి బాబోయ్ మల్లీ.. అంత ముద్దుగా ఎట్టా పుట్టేశావ్” అంటూ ట్వీట్ చేశారు. టైటిల్ తోనే అటు చిత్ర పరిశ్రమ వర్గాల్లో, ఇటు సాధరణ ప్రేక్షకుల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించడం విశేషం.