
అవును మీరు చూస్తున్నది నిజమే మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు కానీ అది సినిమాలో కాదు ఒక ప్రకటనలో. మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తే చూడాలన్న ఆసక్తి ఆయన అభిమానులకు ఎంతగానో ఉంది ఎప్పుడో ‘కొడుకు దిద్దిన కాపురం’లో బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేసిన మహేష్ బాబు హీరో అయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ద్విపాత్రాభినయం చేసింది లేదు. ఇలాగైనా తన అభిమానులను సంతృప్తి పరచాలి అనుకున్నారో ఏమో ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ విడుదల చేసిన తాజా ప్రటనలో మహేష్ చేసిన ద్విపాత్రాభినయం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. ఈ ప్రకటనలో ఆయన అన్న, తమ్ముళ్లుగా నటించారు మహేష్.
తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ పట్టణం వచ్చిన అన్నయ్యకు తన ఆఫీసులో దుమ్ము పట్టిన టేబుల్ ని చూపిస్తాడు తమ్ముడు, అక్కడే బాగా మాసిపోయిన బట్టల్ని వాషింగ్ మెషీన్లో ఉతుక్కోమని సలహా కూడా ఇస్తాడు. పంచెకట్టులో, మెలితిరిగి ఉన్న మీసాలతో ఉన్న అన్నయ్య తమ్ముడితో షాపింగ్ దద్దరిల్లిపోవాలంటూ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం అందరినీ ఆకట్టుకుంటుంది. తమ్ముడి పాత్ర మోడ్రన్ స్టైల్లో ట్రెండీగా ఉంది. ఈ యాడ్ లో బ్యాచిలర్ తమ్ముడికి అన్నయ్య ఇచ్చిన సలహాలు బావున్నాయి వీలైతే...మీరు చూడండి.