‘అమ్మొరు తల్లి’ ట్రైలర్ ని విడుదల చేసిన మహేష్ బాబు

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఆదిశక్తి అవతారంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం 'మూక్కుత్తి అమ్మన్‌'. ఈ సినిమా తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదల కాబోతోంది. తమిళ నటుడు, కమిడియన్ ఆర్‌.జె.బాలాజీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్‌.జె.బాలాజీ తెలుగులో కూడా మహేష్‌ బాబు నటించిన ‘స్పైడర్‌’ చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. ఆ పరిచయంతో ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను దసరా కానుకగా మహేష్‌ బాబు విడుదల చేశారు. “నటుడు ఆర్‌.జె.బాలాజీ దర్శకుడిగా మారి రూపొందించిన 'అమ్మోరు తల్లి' చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ఆయనతో పాటు చిత్రంలో నటించిన నయనతార ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు” అని మహేష్‌ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భక్తి పేరుతో మోసాలు చేసే కొందరి గురించి అసలు నిజాలు తెలియజేయడానికి అమ్మవారు భూమిపైకి వస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారని ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతుంది. ట్రైలర్‌ మాత్రం చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండి ఉంది. తమిళంలో టాప్ హీరోస్ కి ఉన్న క్రేజ్ నయనతారకి కూడా ఉంది. తాను మెయిన్ క్యారెక్టర్ గా చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పడు ఈ సినిమా మీద కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో దీపావళి కనుకగా విడుదల అవబోతుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.