
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా కల్ట్ స్టేటస్ సంపాదించాయి. ముఖ్యంగా ఖలేజా సినిమాలో సరికొత్త కామెడి టైమింగ్ తో మహేష్ బాబు గారిని సరికొత్తగా ప్రెజంట్ చేయడంలో త్రివిక్రమ్ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యారు. ఈరోజుతో ఖలేజా విడుదలై 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
"ఖలేజాకు పది సంవత్సరాలు. నటుడిగా నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకున్న సినిమా ఇది. ఈ చిత్రం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నా స్నేహితుడు త్రివిక్రమ్ కు థాంక్స్. మనిద్దరి కాంబినేషన్ లో తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా. అతి త్వరలోనే" అని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసారు మహేష్ బాబు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉండబోతోందని చెప్పకనే చెప్పారు మన సూపర్ స్టార్.