
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘నవరస’ అనే చిత్రాన్ని 9 మంది దర్శకులు, 9 విభిన్న కథలతో ఒక సినిమా తీయబోతున్నారు అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ రోజు ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ఈ సినిమాని ప్రకటించారు. మణిరత్నం మరియు జయేంద్ర పంచపకేశన్ సంయుక్తంగా నిర్మించిన ‘నవరస’ చిత్రం నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. ఈ చిత్రంలో 9 లఘు చిత్రాలు ఉంటాయి, ఇవి 9 రాసాల ఆధారంగా ఉంటాయి. లఘు చిత్రాలకు కె.వి ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బెజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, హలితా షమీమ్, పొన్రామ్, కార్తీక్ నరేన్, ఆర్. రతీంద్రన్ ప్రసాద్, అరవింద్ స్వామి దర్శకత్వం వహించనున్నారు మరియు రేవతి, నిత్యా మీనన్, పార్వతి, ఐశ్వర్య రాజేష్, తదితరులు నటించారు. ఎ.ఆర్. రెహమాన్, డి ఇమ్మన్, గిబ్రాన్, అరుల్ దేవ్, కార్తీక్, రాన్ ఏతాన్ యోహాన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. సంతోష్ శివన్, బాలసుబ్రహ్మనియం, మనోజ్ పరమహంస, అభినందన్ రామానుజం, శ్రేయాస్ కృష్ణ, హర్ష్ విర్త్ , విరాజ్ సింగ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. నవరస కథను పట్టుకొట్టై ప్రభాకర్, సెల్వా, మదన్ కార్కీ, సోమేతరన్ రాశారు. ఈ సినిమాతో వచ్చిన డబ్బులని కరోన వలన నష్టపోయిన మీద పడిన చాలా మంది సినీ పరిశ్రమకి సంబంధించిన జనాలకి అందిస్తారని సమాచారం. ఈ సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఈ సినిమాతో నటుడు అరవింద స్వామి డైరెక్టర్ గా కూడా మన ముందుకు రాబోతున్నారు.