
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా సినిమా ‘క్రాక్’. నిజానికి ఈ చిత్రం మేలోనే విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా షూట్ వాయిదా పడిన విషయం తెల్సిందే. దాదాపు ఏడు నెలల తర్వాత ‘క్రాక్’ సినిమా షూట్ తిరిగి మొదలైంది. ఈ విషయాన్ని రవితేజ గారే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి ఇది ఫైనల్ షెడ్యూల్ అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. క్రాక్ లో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా క్రాక్ తెరకెక్కుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకుడు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాకరుకి క్రాక్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.