
మెగా ప్రిన్సెస్ నిహారిక ప్రఖ్యాత యు&ఐ మ్యాగజైన్ కవర్ పేజీపై కొత్త లుక్ లో కనిపించారు. స్పెషల్ డిజైనర్ డ్రెస్ ధరించి అందరినీ ఆకర్షించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని మంగత్ రాయ్ జ్యువెలరీ, అశ్విని రెడ్డి, వరుణ్ చక్కిలం ఔట్ ఫిట్స్ అందించగా, శాండీ శాస్త్రి మేకప్ హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరించారని నిహారిక స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో ట్వీట్ చేసింది. నిహారిక ఈ గెటప్ లో చాలా కొత్తగా ట్రెడిషనల్ లుక్ లో ట్రెండీగా కనిపిస్తోంది.
ఈ లుక్ కోసమే ఇటీవల సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో నిహారిక జిమ్ లో కఠోరంగా శ్రమించినట్లు తెలుస్తోంది. చైతన్యను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్న ఈ మెగా ప్రిన్సెస్ లైఫ్ పట్ల చాలా క్లారిటీ ఉన్న మహిళ. సోషల్ మీడియాలో తన మనసులోని భావాలను స్వేచ్ఛగా తెలియజేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రిన్సెస్ మేకోవర్ ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ కి నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ...అందమైన కామెట్లతో ముంచేస్తున్నారు.