
తరువాతి ఎన్నికలు వచ్చే వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. వరసగా కొత్త సినిమాలకు సైన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో కొత్త చిత్రానికి సంతకం చేశారు. దానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వారి కాంబినేషన్లో ఇదే మొదట సినిమా. ఈ సినిమా కి కథ వక్కంతం వంశీ అందించనున్నారు.
ఇంతకు ముందు వక్కంతం వంశీ కథ తో సురేందర్ రెడ్డి ఎంతో మంది స్టార్ హీరోలతో హిట్ సినిమాలు రూపొందించాడు.
రామ్ తల్లూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్న ఈ సినిమా ని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో నటిస్తున్నారు. తర్వాత క్రిష్, హరీష్ శంకర్ సినిమాలు అయ్యాక సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది.