
తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగకి ఎంతో చరిత్ర ఉంది. రకరకాల పూలని సేకరించి బతుకమ్మని పేర్చుకుని మహిళలు ఆడుకునే పూల పండుగ ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పలువురు ప్రముఖులు తెలంగాణ ఆడపడుచులకి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ ఆడ పడుచులకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. “బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
బతుకమ్మ 💐🌼సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. 🌷🌻🌹బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.🌺🌻🌹 pic.twitter.com/qM8tHhrpfd
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 24, 2020