
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి తాజాగా కోవిడ్ -19 పరీక్షించగా నెగెటివ్ వచ్చింది. బాలు కుమారుడు, ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ చరణ్ మాట్లాడుతూ "నా తండ్రి ఆరోగ్యంగా మరియు స్థిరంగా ఉన్నారు. కరోనా టెస్ట్ లో రిపోర్ట్ నెగెటివ్ వచ్చింది." అన్నాడు. ఇంకా తన తండ్రి మెరుగైన ఆరోగ్య స్థితిపై సంతోషం వ్యక్తం చేశాడు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌లో అనారోగ్య సమస్యలకు బాలు చికిత్స పొందుతున్నారు. మొదట్లో కరోనా లక్షణాలు లేకపోయినా చాలా తక్కువ ఫీవర్ ఉందని ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన కొన్ని రోజులకు బాలు ఆరోగ్యం క్షీణించింది. అయితే ఇప్పుడు ఈ లెజెండరీ సింగర్ కరోనా ని జయించి నెగెటివ్ రావడం చాలా సంతోషకరమైన విషయం.
ఈ మంచి వార్తతో నెటిజన్లు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నారు!