
సక్సెస్ అనేది మామూలు మనిషిని హీరోని చేస్తుంది.
సూపర్ స్టార్స్ ని చేస్తుంది. ఆ సక్సెస్ కి కారాణమైన వాళ్వని ఎవ్వరూ మరచిపోరు.అంతేకాదు వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయందే మనసు నిదురపోదు.
గతంలో శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివకు మహేష్ బాబు ఆడి కారును గిప్ట్ గా ఇచ్చాడు. మరికొంతమంది
కొన్ని సినిమాలకి టీమ్ మెంబర్స్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ కి కూడా ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది.
ఈమధ్య ప్రభాస్ తన పర్సనల్ ట్రైనర్ కి ఏకంగా 75లక్షల రేంజ్ రోవర్ కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడం వైరల్ అయ్యింది.
ఇప్పుడు అదే దారిలో నితిన్ చేరాడు.
భీష్మ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల కి రేంజ్ రోవర్ కార్ ని నితిన్ ఇచ్చాడు.
నితిన్ డేట్స్ కోసం రెండు సంవత్సరాలు వెంకీ కుడుముల నిరీక్షించాడు. సూపర్ హిట్ స్క్రిప్ట్ ని చేతిలో పట్టుకొని రెండు సంవత్సరాలు తన కోసం వెయిట్ చేసినందుకు రుణం తీర్చుకోవాలని రేంజ్ రోవర్ కార్ ని ఇచ్చాడు నితిన్. అదికూడా వెంకీ కుడుముల బర్త్ డే కి రేంజ్ రోవర్ కార్ ని ఇవ్వడం. వెంకీ కుడుముల కూడా నిజంగా సర్ ప్రైజ్ అయ్యాడనే చెప్పాలి.
ఏది ఏమైనా ఇలాంటి వాతావరణాన్ని మన టాలీవుడ్ హీరోలు కొనసాగిస్తుండం నిజంగా అభినందనీయం.