
శ్రీ చిత్రంతో టాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హ్యాపిడేస్ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. కొంచం ఇష్టం కొంచం కష్టం, 100%లవ్, బధ్రీనాద్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంటా, రెబెల్, తదితర చిత్రాల్లో నటించిన తమన్నా రాజమౌళి గారి దర్శరకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. కథ నచ్చితే యువ కథానాయకులతో నటించేందుకు ఆమె సిద్దంగా ఉన్నారు ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ మొదలవ్వగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి. కాగా లాక్ డౌన్ సడలింపులతో కొన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
కాగా ఆరు నెలల విరామం తర్వాత మొదలైన చిత్ర షూటింగ్స్ లో పాల్గొనేందుకు ఆవిడ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఏడాది చివరి వరకు ఆవిడ షూటింగ్స్ తో ఫుల్ బిజీ కానున్నారు. గోపిచాంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘సీటిమార్’ ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ఆక్టోబర్ లో మొదలుకానుంది. నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధి దర్శకత్వంలో వస్తున్న అంధాధూన్ రిమేక్ చిత్రంలో తమ్మన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్రను హిందీలో టబు పోషించారు. దీని తర్వాత యువ కథానాయకుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం చిత్రంలో కూడా ఆవిడా నటిస్తునారు. ఈ చిత్రం నవంబరులో సెట్స్ పైకి వెళ్ళనుందని చిత్ర బృందం తెలిపింది.
ఇవే కాకుండా తమిళంలో ది నవంబర్స్ స్టోరీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఆవిడ తెలుగులో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆహా ఓ.టీ.టీ. కోసం తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో కుడా ఆవిడ నటించనున్నారు.