
‘ఇష్మార్ట్ శంకర్’ హిట్ తర్వాత రామ్ పోతినేని ‘రెడ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కి సిద్దంగా ఉంది. ఇప్పటి వరకు ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీస్ లో చేసిన రామ్ ‘రెడ్’ సినిమాతో కొత్త కోణం లో కనపడనున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమలతో రామ్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా అవ్వడంతో రెడ్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. బియర్డ్ లుక్ తో ఉన్న రామ్ పోస్టర్స్ ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. విడుదల చేసిన రెడ్ సినిమా పాటలుకు మంచి స్పందన లభించింది. రామ్ సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఆయన ఒక యూట్యూబ్ చానల్ కూడా స్టార్ట్ చేశారు.
కాగా ఆయన తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక విడియో ని పోస్ట్ చేసారు. తన యూట్యూబ్ చానల్ సబ్ స్రైబర్స్ వన్ మిలియన్ కి చేరుకున్న సందర్భంగా ఆ సంతోషాన్ని ఆ వీడియో ద్వారా వ్యక్తపరిచారు. చానల్ ను సబ్ స్రైబ్ చేసుకున్న తన అభిమానులను ఉద్దేశించి “మీ రంతా నా బంగారాలు , మీ అందరికి థ్యాంక్యూ” అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో విడియో పోస్ట్ చేశారు. టాలీవుడ్ బ్యాచ్లర్ హీరోస్ రానా, నితిన్ ,నిఖిల్ ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలు ఎక్కారు. మిగిలిన బ్యాచ్లర్ హీరోస్ తమ పెళ్ళి త్వరలో ఉండబోతుందని చెప్తున్నారు, కానీ హీరో రామ్ పోతినేని మాత్రం తన పెళ్ళి గురించి ఇంకా ఎక్కడా ప్రస్తావించలేదు.