
ఈ రోజు ప్రముఖ నటి పూజ హెగ్డే పుట్టినరోజు. ఈ సంవత్సరంతో ఆమె 30వ పడిలోకి అడుగుపెట్టారు. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కు చేరుకున్నారు పూజ. వరసగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీ గా ఉన్నారు. తాజాగా పూజ హెగ్డే నటిస్తోన్న చిత్రాలు రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. ఆమె పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ లో ఆమె లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రేరణ అనే పాత్రలో కనిపించనుంది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో అఖిల్ సరసన నటిస్తోంది. ఇందులో కూడా పూజది విభిన్నమైన పాత్రే. ఇందులో విభ అనే స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రకు సంబంధించిన లుక్ ను ఈరోజు విడుదల చేసారు. బొమ్మరిల్లు, పరుగు, ఆరంజ్ ఫేం బొమ్మరిల్లు భాస్కర్, ఒంగోలు గిత్త సినిమా తరువాత, చాలా కాలానికి తెలుగులో దర్శకత్వం వహిస్తుండగా, గీతా ఆర్ట్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.