
కరోనా ప్రభావం ఏ మాత్రమూ తగ్గకున్నా ప్రజలు తమ తమ పనుల్లో పడిపోయారు ఆరు నెలలుగా కార్మికులకు ఎలాంటి పనీ లేదు రెక్కాడితే గానీ డొక్కాడని ఎంతో మంది సినిమా కళాకారులు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇది నిజం. ఎవరూ కాదనలేని వాస్తవం.
ఒక ప్రోడక్ట్ తయారు చేయడం ఎంత గొప్ప విషయమో
ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ చేయడం కూడా అంతే గొప్ప విషయం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే
థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాల తయారి ఆగిపోయింది. దీంతో ప్రొడక్షనే లేకుండా పోయింది.
ఎంతోమంది సినిమా కార్మికులు రోడ్డున పడ్డారు.
వాళ్ళకు జీవితమే సినిమా...ఆ సినిమానే ఆగిపోతే...
అదీ ఆరు నెలలుగా...
ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎలాగైనా సినిమా థియేటర్లు ఓపెన్ చేయాల్సిన అవసరంపై...
'మహానటి' సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. సినిమా థియేటర్స్ ని ఓపెన్ చేయాల్సిందేనని, సినిమాని థియేటర్లలో చూడాలని ఓటీటీల్లో కాదని నాగ్ అశ్విన్ అన్నారు. నేను అందరి భద్రత గురించి ఆలోచిస్తూనే చెబుతున్నాను.
జిమ్ లు,బార్ లు, షాపింగ్ మాల్స్,దేవాలయాలు, బస్సులు, రైల్లు, విమానాల సర్వీసుల్ని ఎలాగైతే మొదలుపెట్టారో అలాగే థియేటర్లు కూడా రీఓపెన్ చేయాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. థియేటర్లని తెరిచే సమయం వచ్చిందని,
థియేటర్లో మాస్క్ ధరించి సినిమా చూడాలని ఎదురుచూస్తున్నానని అక్కడ ఫాస్ట్ ఫార్వడ్, పాజ్ అంటూ ఏమీ వుండవని తన ట్విట్టర్ అకౌంట్లో నాగ్ అశ్విన్ వెల్లడించారు.