
యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం ఒరేయ్ బుజ్జిగా. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ఆహాలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు వస్తున్న రెస్పాన్స్ కు రాజ్ తరుణ్ అండ్ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే లాంచ్ అయింది కూడా. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో వైరల్ అయింది. నా దర్శకుడు బాగా కమర్షియల్ అంటూ రాజ్ తరుణ్ ఆ వీడియోకు ఒక క్యాప్షన్ జతచేసాడు. అందులో ములక్కాడ మటన్ పెడుతున్నాను అనగానే ఆ వ్యక్తికీ క్లోజ్ షాట్ పెట్టమని కెమెరా మ్యాన్ తో మాట్లాడాడు. అలాగే మటన్ లేదు అనగానే షాట్ అవసరం లేదు అని ఫన్నీగా చెప్పడం సరదాగా అనిపించాయి. ఆ వీడియో కి డైరెక్టర్ విజయ్, మరీ ఇంత కమర్షియల్ అనుకోలేదు అంటూ నవ్వుతున్న ఈమోజీ జతపరిచాడు.