ట్విట్టర్ లో ఎన్.టీ.ఆర్ రామ్ చరణ్ సరదా ట్వీట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమరం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ తరువాత ఇటీవలే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ముందుగా ప్రామిస్ చేసినట్లుగానే ఎన్టీఆర్ స్పెషల్ వీడియోను అక్టోబర్ 22న ఆర్.ఆర్.ఆర్ టీమ్ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఈ వీడియోలో కొమరం భీమ్ లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తాడు. అయితే ఈ వీడియోకు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందిస్తుండడం విశేషం. ఇక వీడియో విడుదలవ్వడానికి ఒక్క రోజే ఉండడంతో ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రమోషన్స్ ను విభిన్నంగా ప్లాన్ చేసింది. ముందుగా వీడియోకు ఒక్క రోజే అన్న జిఫ్ ను
పోస్ట్ చేసిన చరణ్, ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ, "నా వీడియోకు నువ్వు లేట్ చేసినట్లుగా నీ వీడియోకు నేను లేట్ చేయను" అని ట్వీట్ చేసారు. వెంటనే ఎన్టీఆర్ దానికి రీ ట్వీట్ చేస్తూ "నువ్వు ఇప్పటికే ఐదు నెలలు లేట్ బాసు. రాజమౌళితో సినిమా అంటే ఇలానే ఉంటుంది" అంటూ సరదాగా ఇద్దరికీ కలిపి సెటైర్ వేశారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.