
అక్కినేని నాగచైతన్య ,సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ కమ్ముల ,సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరి తో అలరించింది. మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'లవ్ స్టోరి'. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు చేయటంలో శేఖర్ కమ్ముల ముందుటారు. అంతే సహజంగా శేఖర్ కమ్ముల చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తారు. లవర్ బాయ్ నాగచైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్ కావటం తో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది.
లాక్ డౌన్ తర్వాత మళ్ళీ షూటింగ్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నిజామాబాద్ లోని ఆర్మూర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. పల్లెటూరి వాతావరణం శేఖర్ కమ్ముల చాలా అందంగా చిత్రీకరిస్తారు. ఆ పల్లెటూరి వాతావరణానికి సాయి పల్లవి లాంటి హిరోయిన్, నాగ చైతన్య లాంటి హీరో తోడైతే ఆ సన్నివేశాలు మరో స్థాయి లో ఉంటాయి. ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేమికులకు ఈ లవ్ స్టోరీ చిత్రం మంచి అనుభూతి అవుతుంది. ప్రస్తుతం జరిగే షెడ్యూల్ తో లవ్ స్టోరి చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తికానుంది. నాగ చైతన్య ఈ చిత్రం తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కె. కూమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. లవ్ స్టోరి చిత్రానికి నారాయణ్ దాస్, కె. నారంగ్,పి.రామ్మోహన్ రావు నిర్మాతలు.