
నాగశౌర్య హీరోగా, ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న అతని 20వ చిత్రంలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ మొదలు పెట్టారు. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడి కండలు పెంచాడు నాగశౌర్య. ఈ సారి మరింత కొత్తగా ప్రయత్నం చేయాలని కంప్లీట్ గా తన ఆహార్యం మార్చేసుకున్నాడు. పాత్రకి తగ్గట్లు కొత్త లుక్ లోకి వచ్చేశాడు. ఆల్రెడీ ఈ సినిమా ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకున్నాయి..