#WildDog in the Himalayas!! pic.twitter.com/k1gf1fNb7E
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 23, 2020
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మనాలిలో మొదలైన విషయం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో స్వయంగా నాగార్జున నుండే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం రోహ్తాంగ్ పాస్ వద్ద ‘వైల్డ్ డాగ్’ యూనిట్ షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన దారి నాగార్జున తెలిపారు. సముద్రమట్టానికి దాదాపు 13000 అడుగుల ఎత్తులో ఈ దారి ఉంది.
ప్రతీ నవంబర్ నుండి మే వరకూ ఈ దారిని మూసి ఉంచుతారు. అసలు ఈ షెడ్యూల్ మేలోనే జరగాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా కుదర్లేదు. మళ్ళీ ఇన్ని నెలలకు పర్మిషన్ తెచ్చుకుని షూటింగ్ చేస్తున్నారు. మరో 21 రోజులు వైల్డ్ డాగ్ షూటింగ్ అక్కడే జరుగుతుందని నాగ్ క్లారిటీ ఇచ్చారు. నాగార్జున ఎన్.ఐ.ఏ ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో
విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వైల్డ్ డాగ్ ను సోలమన్ తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దియా మీర్జా తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు.