
తెలుగులో ఇప్పుడిప్పడే పెరుగుతున్న ఓ.టీ.టీ క్రేజ్ లో మరో యాప్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఫిలిమ్ అనే ఓ.టీ.టీని నంబర్ 1న ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఫిలిమ్ యాప్‌లో కొత్త సినిమాల ప్రీమియర్లు, ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్‌లను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కొత్త కంటెంట్ అందించేందుకు వస్తున్న ఫిలిమ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిలిమ్ యాప్‌లో తొలి చిత్రంగా నవంబర్ 1న పిజ్జా2 మూవీ రాబోతుంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించగా, గాయత్రి హీరోయిన్గా నటించింది.అంతేకాకుండా త్రిష, నివిన్ పాలీ నటించిన హే జ్యూడ్, మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన రంగూన్ రౌడీ, ప్రియమణి నటించిన థ్రిల్లర్ మూవీ విస్మయ, ధృవ, జేడీ చక్రవర్తి నటించిన మాస్క్ తదితర చిత్రాలను ఫిలిమ్ ఓటీటీ ద్వారా అందించనున్నారు. ఫిలిమ్ ఓటీటీ యాజమాన్యం విభిన్నమైన, విలక్షణమైన కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ ధరకు సబ్ స్క్రిప్షన్ ద్వారా అందించాలని ఫిలిమ్ ఓ.టీ.టీ ఆలోచనలో ఉన్నారు . మా ఓటీటీలో ప్రీమియర్ అయిన కొత్త సినిమాలను నేరుగా థియేటర్లో కూడా విడుదల చేస్తున్నాం. ఇది ఓ.టీ.టీ చరిత్రలో కొత్త ట్రెండ్ అవుతుంది. అన్నారు. ఈ ఓ.టి.టి ప్లాటుఫామ్ ఏ మేరకు తెలుగులో క్లిక్ అవుతుందో నవంబర్ 1 నుంచి చూడాలి. ఇప్పటికే అల్లు అరవింద్ గారి ఆహా ఓ టి టి తెలుగు ప్రేక్షుకులకి కొత్త సినిమాలని పరిచయం చేస్తుంది.