
కథానాయకుడిగా సహాయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందు విజయ్ కృష్ణ హీరోగా, నటి, యాంకర్, రష్మి గౌతమ్, హీరోయిన్ గా, యువ దర్శకుడు రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి, సుజాత సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అందించారు.
ఈ చిత్రంలో నందు పోతురాజు అనే పాత్రలో నటించారు. ఇది వరకే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. కాగా గాంధి జయంతిని పురస్కరించుకుని హీరో శ్రీ విష్ణు ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. ఆయన తన వాయిస్ ఓవర్ తో నందు పాత్రను పరిచయం చేస్తూ, ‘ఈ మొనగాడి పేరు పోతురాజు. ఇతగాడికి పూరి జగన్నాధ్ అంటే ఇష్టం అనడంలో సందేహమే లేదు. పోకిరి సినిమా చుసిన తర్వాత అది పిచ్చిగా మారిందనడంలో అస్సలు సందేహమే లేదు’ అంటూ సాగే టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. గొడవలంటే ఇష్టపడే అమ్మాయిగా రష్మి నటించింది. మంచి కథాంశంతో వస్తున్న ఈ చిత్రం నటుడిగా నందుకి గుర్తుండిపోయే చిత్రం అవుతుందనడంలో అస్సలు సందేహమే లేదు.