
డార్లింగ్, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ చిత్రాల్ని నిర్మించిన SVCC (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర) బ్యానర్ నుండి ఈ రోజు సప్రైజ్ అనౌన్స్ మెంట్ వచ్చించి. విలక్షణ నటి నిత్య మీనన్, పెళ్ళి చూపులు, కనులు కనులను దోచాయంటే చిత్రాల హీరోయిన్ రీతూ వర్మ లు ముఖ్య పాత్రలతో “అని. ఐ. వి. శశి” దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి నిన్నిలా నిన్నిలా అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ని తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
A platter full of entertainment! Presenting the title and first look of #NinnilaNinnila starring @AshokSelvan, @MenenNithya and @riturv
— SVCC (@SVCCofficial) October 19, 2020
Directed by @AniSasiOnO
Music by @RajeshRadio
DOP #DivakarMani
Produced by @BvsnP under @SVCCofficial
Presented by #BapineeduB pic.twitter.com/jKwitLETjd
సూదు కవ్వం, పిజ్జా 2: విల్లా, ఓ మై కడవులే వంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు అశోక్ సెల్వన్ ఇందులో హీరో గా నటిస్తున్నారు. తెలుగులో తనకు ఇది మొదటి చిత్రం. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉంది. చూస్తుంటే ఇది కామెడీ థ్రిల్లర్ సినిమాలా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ మురగేశన్, ఛాయా గ్రహణం: దివాకర్ మణి, ఎడిటింగ్: నవీన్ నూలి.