
విక్టరీ వెంకటష్ గారు వైవిధ్యానికి మారు పేరు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి ఆయన సినిమాలు ఎప్పుడూ. కొత్త కొత్త క్యారెక్టర్లతో తనలో ఉన్న నటనా లోతులను మనకు తెలియజేస్తూ ఉంటారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో ధనుష్ చేసిన పాత్రను తెలుగులో వెంకటేష్ పోషిస్తున్నారు. తమిళ మాతృకకు ‘వెట్రిమారన్’ దర్శకత్వం వహించగా తెలుగు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో వెంకటేష్ కొత్త గెటప్ లో కనిపించి సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. సుమారు 7 నెలలుగా కోవిడ్ వలన సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. స్టార్స్ అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ మార్గ దర్శకాలు తో షూటింగ్స్ మొదలయ్యాయి. మళ్లీ స్టార్స్ మొఖానికి మేకప్ వేసుకుంటున్నారు.
వెంకటేష్ గారు కూడా నవంబర్ మొదటి వారం లో నారప్ప కొత్త షెడ్యూల్ లో పాల్గొననున్నారు. మామూలుగా ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కోవిడ్ వలన చిత్రీకరణ ఆగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నే ఈ సినిమా 75% చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ కొత్త షెడ్యూల్ లో సినిమా పూర్తయ్యే వరకు అవిరామంగా చిత్రీ కరణ జరపి వీలైనంత తొందరగా సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.