
ఓనం...కేరళలో ఇష్టంగా జరుపుకునే పండుగ. ఇక్కడ అన్ని వయస్సుల ప్రజలు ఆనందోత్సహాంతో ఈ పండుగలో పాల్గొంటారు. ఓనమ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మాలయాళం క్యాలెండర్ ను బట్టి జరుపుకుంటారు. దీన్ని కొల్లా వరణం అని కూడా పిలుస్తారు. ఈ పండగ నాలుగు నుంచి పది రోజులు వరకు ఉంటుంది. ఈ కొద్ది రోజుల్లో కేరళ ప్రజలు, సంస్కృతి, సంప్రదాయం మరియు ఆచారాలను ప్రతిబింబించేలా జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం కేరళను మహాబలి రాజు పాలించారు. మహాబలి పాలనలో ప్రజలంతా సుసంపన్నంగా మరియు సంతోషంగా ఉన్నారు. గొప్ప రాజుగా మహాబలి ని భక్తితో కొలుస్తారు.
ఈ పండుగను కేరళ సెలబ్రిటీస్ కూడా ఎంతో ఇష్టాంగ జరుపుకుంటారు. అదే విధంగా అనుపమ పరమేశ్వరన్ కూడా ఓనమ్ జరుపుకున్న ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసి అందరికి ఓనమ్ శుభాకాంక్షలు తెలిపింది. ఇంకా కేరళ నటీ నటులు అనేకమంది కేరళ ప్రజలకి ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు.