మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ప్రీ టీజర్ అదిరిపోయిందిగా!

అక్కినేని వారసుడిగా వచ్చి, భారీ హైప్ తో లాంచ్ అయిన అఖిల్ అక్కినేని చేసినవి మూడు సినిమాలు, అయినా ఇంత వరకూ విజయాన్ని అందుకోలేదు. విక్రం కే కుమార్ హలో చిత్రం లో తనకు కొద్దిగా ఉపశమనం ఇచ్చినా చేసిన మూడుకు మూడూ కూడా దారుణమైన పరాజయాలను అందుకోవడంతో అఖిల్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ చేస్తోన్న నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్.  వరుస హిట్ల మీద ఉన్న పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ కల్లా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్ గా పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ఈరోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ప్రీ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ ను అక్టోబర్ 25న ఉదయం 11:40 నిమిషాలకు విడుదల చేస్తారని తెలియజేసారు. ఇక ప్రీ టీజర్ విషయానికి వస్తే ఈ చిత్రంలో అఖిల్ తన పాత్ర పరిచయంతో సాగింది. హర్షగా అఖిల్ కనిపించబోతున్నాడు. ప్రతీ మగవాడికి కెరీర్, పెళ్లి రెండూ సమభాగాలైతే కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన హర్ష, పెళ్లికి మాత్రం ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు అన్నది చాలా వినోదాత్మకంగా చూపించబోతున్నారు. గీతా ఆర్ట్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ను గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.