
ఎక్కడ విన్నా ఇప్పుడు అదే పాట...
ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో నైనా ఆ పాట ఉండాల్సిందే.
ఏ పార్టీలోనైనా ఇప్పుడు వాంటెడ్ గా వినిపిస్తున్న
'వైరల్ గీతం"
"టిక్ టాక్" లో దుమ్ములేపిన ఆ పాట
ఇప్పుడు "ఇన్స్టాగ్రామ్"లో ఇరగదీస్తుంది.
"డీ" లాంటి మెగా డాన్స్ పోగ్రామ్ లో డీజే మిక్సై ఆడిస్తుంది.
అదే "డీ" ప్రోగ్రామ్ లో "పండు" డాన్స్ చేసిన ఈ పాట వీడియో ప్రస్తుతం 53 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.
అంతటి ఊపూ,ఉత్సాహమున్న పాట
పిల్లలు,పెద్దలు అందరు ఆనందంగా హమ్ చేసుకునే
ఈ ఉత్తరాంధ్ర జానపద గీతం "నాది నక్కిలీసు గొలుసు"
"పలాస1978" సినిమాలోని ఈ పాట అనతి కాలంలోనే 125 మిలియన్ వ్యూస్ ని దాటి వెళ్తుంది.
"ధ్యాన్ అట్లూరి","మనోజ్ కుమార్" సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి "కరుణ కుమార్" దర్శకుడు.
రక్షిత్, నక్షత్ర త్రినయని హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతాన్ని అందించారు.
తనే ఈ పాటని పాడారు.
అరుల్ విన్సెంట్ కెమెరా, విజయ్ కొరియోగ్రఫీ
ఈ పాటకి అదనపు ఆకర్షణని తీసుకొచ్చింది.
ఇంతమందికి చేరువైన ఈ పాట
డిజిటల్ మీడియాలో ఓ రికార్డ్ అనే చెప్పాలి.