
అన్ లాక్ 5.oలో కేంద్రం మరిన్ని సడలింపులను తాజాగా ప్రకటించింది. ఆరు నెలలుగా మూతపడ్డ
థియేటర్స్, మల్టీప్లెక్స్ లు తెరుచుకోనున్నాయి.
సినిమా ఇండస్ట్రీ పై కరోన విసిరిన పంజా ఎలాంటిదో అందరికీ తెలిసిందే... విద్యాసంస్థలు, థియేటర్లు,పార్కులు తప్ప బార్లతో సహా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఇండస్ట్రీలు తెరుచుకున్నాయి. ఇక ఇప్పుడు అన్ లాక్ 5.o లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్ తెరవడానికి అనుమతినిచ్చింది.
సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత వివిధ రాష్ట్రాల విద్యాసంస్థలు తెరవడంపై, విద్యార్థుల తల్లిదండ్రులని సంప్రదించి వారి అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.