
ఆర్.ఎక్స్ 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ తన మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. తన అందంతో వెండితెర పై ప్రేక్షకులని అలరించిన పాయల్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఓ.టీ.టీ లోకి అడుగు పెడుతున్నారు. పాయల్, చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. ఈ సినిమా నవంబర్ 13న ఆహలో స్ట్రీమ్ అవ్వబోతుంది కావున ఈ సినిమా టీం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని అన్నౌన్ చేసింది. ఇక సినిమా వివరాల్లోకి వెళితే ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమాలో చైతన్యకృష్ణ మెయిన్ రోల్ లో నటిస్తున్నారు. పాయల్ గొంతు మీద, చైతన్య కత్తి పెట్టి బెదిరిస్తున్నట్టు ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా దర్శకుడు డయల్ పద్మనాభం కన్నడ లో తీసిన ‘ఆ కారాళ రాత్రి’ సినిమాకి ఇది తెలుగు రీమేక్. ఆ చిత్రం కన్నడ లో 2018 లో రిలీజ్ అయ్యి అటు విమర్శకుల దగ్గర నుంచి ఇటు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి ప్రశంసలు పొందింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు డయల్ పద్మనాభం గారే తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించడం వల్ల అదే ఇంపాక్ట్ మళ్లీ రిపీట్ అవుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. కానీ ఈ విషయం తెలియాలంటే నవంబర్ 13 వరకు మనం ఆగాల్సిందే.