
ఈ మధ్య పూజ హెగ్డే మంచి జోరు మీద ఉన్నారు. ఆవిడ వరసగా భారీ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. గతేడాది పూజ నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆవిడ నటిస్తున్న రెండు తెలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అలాగే అఖిల్ సరసన నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రధమార్ధంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
BIGGG NEWS... #RanveerSingh and director #RohitShetty team up once again... Film titled #Cirkus... #Rohit's take on #TheComedyOfErrors... Costars #PoojaHegde, #JacquelineFernandez and #VarunSharma... Produced-directed by #RohitShetty... Bhushan Kumar and Reliance Ent present. pic.twitter.com/EodlosSard
— taran adarsh (@taran_adarsh) October 19, 2020
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కూడా పూజ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆవిడ సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాళి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా పూజ నటించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధానపాత్రలో ‘సర్కస్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టును ఈరోజే అనౌన్స్ చేసారు. డబల్ రోల్ లో రణ్వీర్ నటిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా ఎంపికయ్యారు. మరో నాయికగా జాక్వెలిన్ ఫెర్నాండే నటించనున్న చిత్ర తదుపరి విశేషాలు త్వరలో వెల్లడించనున్నారు.