
టాలీవుడ్ హీరో ప్రభాస్ ఒకప్పుడు కెమెరాను ఎదుర్కోవటానికి సిగ్గుపడ్డ వ్యక్తి కానీ ఈ రోజు అతను కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు.. ఇండియా మొత్తానికి సూపర్ స్టార్. భారీ అభిమానుల ఫాలోయింగ్ అతని సొంతం. గతంలో తెలుగు హీరోలు కొంతమంది బాలీవుడ్లో సక్సెస్ కోసం ప్రయత్నించారు. వీరెవరికి సాధ్యం కానిది ప్రభాస్ కి మాత్రమే సాధ్య పడింది.. ఈ రోజు ప్రభాస్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయ్యాడు.
బాహుబలితో బాలీవుడ్‌లోకి పరిచయమైన ప్రభాస్ తర్వాతి చిత్రం సాహో తో డైరెక్ట్ హిందీ సినిమా చేసి స్టార్ హీరో క్లబ్‌లోకి ప్రవేశించాడు. ఇప్పుడు టి-సిరీస్ వారి ఆదిపురుషు మరియు నాగ్-అశ్విన్ తో రాబోయే చిత్రాల తో అతని క్రేజ్ మరింత పెరగనుంది. ఇవన్నీ కలిసి ప్రభాస్ ని బిగ్ లీడ్ లోకి తీసుకొచ్చాయి.
" విజయం తలకి ఎక్కుంచుకోవద్దు " అనే సామెత ప్రభాస్ కి సరిగ్గా సరిపోతుంది.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు. ఇండస్ట్రీ లో కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతాడు. పీరియాడిక్ రొమాంటిక్-డ్రామా రాధే శ్యామ్ లో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకి.