
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్
మన "బాహుబలి" ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం'ఆదిపురుష్'. ప్రభాస్ ఎక్కువగా మాస్ ఇమేజ్ ఉన్న రెబల్ పాత్రల్లో నటించాడు. సడెన్ గా రాముని పాత్రలో ప్రభాస్ ని ఎలా ఊహించున్నారనే దానిపై 'ఆదిపురుష్' దర్శకుడు తనదైన శైలిలో జవాబిచ్చారు. ప్రభాస్ కళ్ళు తీక్షణంగా ఉంటూనే... రాముని కళ్ళల్లో ఉన్న కరుణ కూడా ప్రభాస్ కళ్ళల్లో ఉంది. తన బాడీ లాంగ్వేజ్ రాముని పాత్రకి సరిగ్గా సూట్ అవుతుంది. అందుకే ఆ పాత్రకోసం ప్రభాస్ ని సంప్రదించాను. ప్రభాస్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.