
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న పండుగ రానే వచ్చింది. వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ అప్డేట్ ఈ రోజు 11:31 నిమిషాలకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల ద్వారా విడుదల చేసారు. వింటేజ్ కార్ల మధ్య క్లాసీ లుక్ లో ఉన్న ప్రభాస్ ఫోటోలను పోస్ట్ చేసారు. అందులో ‘అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విక్రమాదిత్యా’ అని రాసి ఉంది. ఈ పోస్ట్ తో రాధే శ్యామ్ లో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్యా అన్నట్లుగా వెల్లడించారు చిత్ర బృందం. ప్రభాస్ పుట్టిన రోజుకి 2-రోజుల ముందే చిత్ర బృందం ఈ ఫోటోలను విడుదలను చేసారు. ఇటీవలే జస్టిన్ ప్రభాకరన్ ను సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. యు.వి.క్రియేషన్స్, టి-సిరీస్పతాకాల పై ప్రమోద్ ఉప్పలపాటి, ప్రశీద ఉప్పలపాటి, వంశి కృష్ణ రెడ్డి, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే ప్రభాస్ కు జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఆవిడ పుట్టినరోజు నాడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఇటలీలో జరుగుతుండగా వీలైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు.