బాలివుడ్ పరిశ్రమ పై ‘ప్రతిబంధ్’ పంజా

తన నటనతో దక్షిణాదిన పాగా వేసిన మెగాస్టార్, యావత్ భారత దేశం తన వైపు చూసేలా చేసిన చిత్రం ‘ప్రతిబంధ్’. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత, రామిరెడ్డి ప్రధాన పాత్రల్లో దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో  ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. విడుదలైన అన్ని సెంటర్లలో ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. అవినీతిపరులనీ, దుర్మార్గులనీ శిక్షించడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న ఒక నిజాయితీపరుడైన పోలీస్ పాత్రలో  రాజశేఖర్ గారు జీవించారు. ఈ చిత్రం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెట్టింది.
చిరంజీవి గారి బాలివుడ్ ఎంట్రీ ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయం. ఆయన ఏ సినిమాతో బాలివుడ్ లో అడుగు పెడతారో అని అనుకుంటున్న టైమ్ లో ‘ప్రతిబంధ్’ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. రవిరాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 28సెప్టెంబర్ 1990లో విడుదలైన ఈ చిత్రం సంచలం సృష్టించింది. అందరి చూపు ఒక్కసారిగా మెగాస్టార్ వైపు తిరిగేలా చేసింది. బాలివుడ్ లోని హేమాహేమీలందరూ ఆయన్ను చూసి ఆశ్చర్య పోయేలా చేసింది. ఈ చిత్రంతో ఆయనకు బాలివుడ్ లో గట్టి పునాది పడింది.
ఆ చిత్రం తర్వాత వరసగా ఆజ్ కా గుండా రాజ్, ది జెంటిల్ మెన్ చిత్రాలు ఆయన చేసారు. రెండు సినిమాలు కూడా రీమేక్ చిత్రాలే, ‘ఆజ్ కా గూండా రాజ్’, విజయ బాపినీడు గారి దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాధ్ గారు నిర్మించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి రీమేక్ కాగా, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో ‘యాక్షన్ కింగ్ అర్జున్’ నటించిన ‘జెంటిల్ మెన్’ చిత్రానికి రీమేక్ ‘ది జెంటిల్ మెన్’. ఆ రెండు చిత్రాలు కూడా రికార్డ్లు తిరగరాసిన చిత్రాలే. ఆయన నటవిశ్వరూపంతో ఒక్క సారిగా బాలివుడ్లోని ఉద్దండ నటులని కూడా ఉలిక్కిపడేలా చేసారు. దక్షిణాది కథకుల సత్తాను ఆయన బాలివుడ్ కి తెలిసేలా చేసారు. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాలు బాలివుడ్ లో రీమేక్ అయ్యాయి. ఇక ఆయన బాలివుడ్ ని ఏలడం ఖాయమని అందరూ అనుకున్నా తెలుగు చిత్రాల్లో బిజీ అవ్వడం వల్ల అది సాధ్యపడలేదు.
ఆయన నటించిన ప్రతిబంధ్ చిత్రం విడుదలై సెప్టెంబర్, 28 నాటికి ౩౦ వసంతాలు పూర్తి చేసుకుంది. కాని ఆ చిత్రం అందించిన స్మృతులు చిరస్మరణీయమైనవి. ఆయన బాలివుడ్ లో చేసింది మూడు సినిమాలే అయినా అవి ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.