
'న్యాచురల్ స్టార్' నాని 'గ్యాంగ్ లీడర్' లో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ శర్వానంద్ 'మహాసముద్రం' సినిమా లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో సిద్ధార్థ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ప్రియాంక అరుళ్ మోహన్ చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె చుట్టూనే ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది.
'నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం ద్వారా పరిచయం అయిన ప్రియాంక అరుళ్ మోహన్ పోషించిన పాత్ర మంచి పేరు వచ్చింది. తన నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
హీరో నితిన్ నటించబోతున్న ఓ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారమ్.