
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఇటలీలో మొదలైన విషయం తెలిసిందే. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్, పూజ హెగ్డే అండ్ టీమ్ కొన్ని రోజుల కిందటే ఇటలీ చేరుకున్నారు. షూట్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ప్రభాస్, పూజ హెగ్డే కాంబినేషన్ లో సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా "సినిమా అనేది టీమ్ వర్క్. కరోనా సమయంలో షూట్ చేయడానికి బెస్ట్ టీమ్ కావాలి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రీకరణ మొదలుకావడానికి కారణమైన ఇటలీ దేశానికి, వెంకట్ కృష్ణమనేని, ఇవనో ఫూచ్చి లకు కృతఙ్ఞతలు చెబుతున్నాను" అని రాధా కృష్ణ కుమార్ ట్వీట్ చేసారు. యూ వీ క్రియేషన్స్ రాధే శ్యామ్ ను నిర్మిస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లో రాధే శ్యామ్ విడుదలవుతుంది. యూరోప్ కు చెందిన పీరియాడిక్ లవ్ స్టోరీగా రాధే శ్యామ్ గురించి చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
Making a film is all about teamwork and during covid times, we need the best team and we are thankful to Italy and @italyindia @odumovies @venkat_krishnamaneni for kickstarting the shooting of our dream project #RadheShyam pic.twitter.com/eS81mR56l5
— Radha Krishna Kumar (@director_radhaa) October 14, 2020