
సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేదు దీంతో ఇండియా వైడ్ గా చాలా సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విడుదలవుతున్నాయి.
పలువురు నిర్మాతలు కూడా ఓటీటీ ప్లాట్ ఫాం పై సినిమాల్ని రిలీజ్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు.
డిజిటల్ ప్లాట్ ఫామ్ పై డైరెక్ట్ గా మూవీస్ రిలీజ్ చేయడం పట్ల ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.
దీంతో చాలా మంది నిర్మాతలు థియేటర్స్ పై ప్రస్తుతానికి
ఆశలు వదులుకున్నట్లు తెలుస్తుంది.
అనుష్క శెట్టి నటించిన 'నిశ్శబ్దం' మూవీ అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇప్పుడు అదే కోవలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'ఒరేయ్ బుజ్జిగా'... అనే తెలుగు చిత్రాన్ని అక్టోబర్ 2న 'ఆహా' లో రిలీజ్ చేస్తున్నారు.
విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించారు.
ఈ చిత్రంలో హెబ్బా పటేల్, మాళవిక అయ్యర్, హీరోయిన్స్.
'నిశ్శబ్దం', 'ఒరేయ్ బుజ్జి గా'... ఈ రెండు సినిమాలు ఒకే రోజు అనగా అక్టోబర్ 2వ తేదీన వేరువేరు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై విడుదలవుతున్నాయి.
ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయని ఆశిద్దాం