
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి, తన నటనతో, అందంతో లక్షలమంది అభిమానులను సంపాదించుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. 2009 లో ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో తెరంగ్రేటం చేశారు. ఆ తర్వాత 2011 లో ‘కెరటం’ అనే సినిమాతో తెలుగులోకి ప్రవేశించారు. అదే సినిమా ‘యువన్’ అనే పేరుతో తమిళంలో కూడా రిలీజ్ అయింది. ఆ విధంగా తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి తన కెరీర్ ని ప్రారంభించారు రకుల్ ప్రీత్ సింగ్. తరువాత వెంకటాద్రి ఎక్ప్రెస్, కిక్ 2, ధ్రువ వంటి హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షుకుల మనసు గెలుచుకున్నారు. 2014 లో యారియాన్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుని అయ్యారే, మార్జవాన్, షిమ్లా మిర్చి, దే దే ప్యార్ దే వంటి చిత్రాల్లో నటించారు. ఎంతో మంది అభిమానలను సంపాదించుకున్న రకుల్ వారికి దగ్గరగా ఉండడానికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ తన యోగ క్షేమాలు తెలియచేస్తూ ఉంటారు. యోగా, ఫిట్ నెస్ వీడియోలు పోస్టూ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. రీసెంట్ గా రకుల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది హనీ సింగ్ “ఛలాంగ్” సినిమా కోసం “కరే ని కర్దా” అనే ర్యాప్ పాట పాడారు. ఆ నేపథ్యంలో “కరే ని కర్దా ర్యాప్ ఛాలెంజ్” క్రియేట్ చేసారు. నటుడు అర్జున్ కపూర్ తనని నామినేట్ చేయడంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరిస్తూ రకుల్ “కరే ని కర్దా ర్యాప్ ఛాలెంజ్” లో పార్టిసిపేట్ చేసి దానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్ కు నటుడు టీవీ హోస్ట్ అపర్ శక్తి ఖురానా ని నామినేట్ చేసారు. ఈ ఛాలెంజ్ లో ఇప్పటికే పలువరు సినీ ప్రముఖులు స్వీకరించి తమ ర్యాప్ స్కిల్స్ ని ప్రదర్శించారు. ప్రస్తుతం రకుల్ ఉప్పన సినిమాతో హీరోగా పరిచయమవుతున్న వైష్ణవ్ తేజ్ సరసన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.