
భాగ్యనగరం వర్షం అంటేనే బయపడుతోంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి దాదాపుగా 30-సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. చెరువులు తెగినట్టుగా వరదలు పారాయి, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. చాలా కుటుంబాలు నిలువనీడ లేకుండా రోడ్డున పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి, నగరాన్ని పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశారు. తాజాగా హీరో రామ్ పోతినేని మంత్రి కే.టీ.ఆర్ ను కలిసి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇంతకుముందే...రెబల్ స్టార్ ప్రభాస్ ఒక కోటి 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చెరో కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ 50 లక్షలు, నాగార్జున 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, రవితేజ రూ.10 లక్షలు, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా రూ. 10 లక్షలు, దర్శకులు ఎన్.శంకర్ 10 లక్షలు, హరీష్ శంకర్ రూ.5 లక్షలు, అనిల్ రావిపూడి 5 లక్షలు నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు, ఇంకా పలువురు సీ.యం. సహాయక నిధి కి విరాళాలు అందజేసిన వారి జాబితాలో ఉన్నారు
Heartfelt thanks to noted film actor @ramsayz for donating Rs 25 Lakh to the CM Relief Fund: Minister @KTRTRS #HyderabadRains pic.twitter.com/XZveZNnS3W
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 22, 2020