
భారతీయ ప్రముఖ నటీమణులలో "రమ్య కృష్ణ" ఒకరు. గ్లామర్ రోల్స్ అయినా, భక్తి రసం అయినా, సెంటిమెంట్ అయినా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు అయినా ఆవిడ అవలీలగా పోషిస్తుంటారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి 250 కి పైగా చిత్రాల్లో నటించారు ఆమె. ఈ రోజు రమ్య కృష్ణ తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ సినిమా పడయప్పలో ఆమె పోషించిన నీలంబరి పాత్ర అప్పట్లో ఓ సెన్సేషన్. రజనీ కాంత్ హీరోగా నటించిన ఆ సినిమా తెలుగులో నరసింహ పేరుతో విడుదల అయ్యి ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో ఆమె నటనకు ఎన్నో ప్రశంశలు దక్కాయి. దాని తర్వాత మళ్ళీ అంతటి పేరు తెచ్చిపెట్టిన సినిమా బాహుబలి. బాహుబలి లో శివగామి రోల్ లో నటనకు దేశం మొత్తం ఆమెకు ప్రశంసలు దక్కాయి.
రమ్య కృష్ణ క్లాసికల్ డాన్సర్. భరతనాట్యం, పాశ్చాత్య మరియు కుచిపూడి నాట్యాలల్లో ఆమె శిక్షణ తీసుకుంది. ఆమె అనేక రంగస్థల ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 1984 లో తొలిసారిగా కెమెరా ముందుకి వచ్చినప్పుడు కేవలం 14 సంవత్సరాలు వయసు ఆమెకి. మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన భానుచందర్ నటించిన 'భలే మిత్రులు' చిత్రంతో ఆమె టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. రమ్య కృష్ణ కెరీర్ లో తన అద్భుత నటనకు నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డులు మరియు తెలుగులో నంది అవార్డులను గెలుచుకుంది. అన్నమయ్య, పడయప్ప, బాహుబలి రమ్య కృష్ణ కెరీలో బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. మీడియా9 రమ్యకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.