అంతర్జాతీయ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక సంచలనం. బ్యాట్స్ మాన్ గా, కీపర్ గా, కెప్టెన్ గా ఎన్నో సంచలన విజయాలు టీంకి అందించాడు. గ్రౌండ్ లోనే కాకుండా బయట కూడా అతని నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమే.. ఎవరూ ఊహించని సమయంలో టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేలు, టి ట్వంటీ మ్యాచుల్లో కొనసాగుతూ వచ్చాడు. అయితే మొన్న భారత 74 స్వాతంత్ర్య దినోత్సవం నాడే ధోనీ ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.
'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో షేర్ చేశాడు.
ధోనీ క్రికెట్ లోనే కాకుండా ఇండియన్ ఆర్మీ లో లెఫ్టినెంట్ కల్నల్ గా చేసాడు. 2019 లో రెండు వారాలు పాటు. అలా ధోనీ ఆర్మీ డ్రెస్ లో సోల్జర్స్ తో కలిసి ఉన్న వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఆ వీడియోలో ధోని ఫ్లైట్ లో సైనికులతో కలిసి పారాచూట్ వేసుకుని ఫ్లైట్ నుండి కిందకి దూకుతూ సాహసం చేసిన దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి..