
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న తాజా చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.యష్ తో పాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో సంజయ్ దత్ నటించనున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపించనున్నారు వచ్చే షెడ్యూల్ లో సంజయ్ దత్ టీమ్ తో జాయిన్ అవ్వనున్నారు. ఈ ఏడాది చివరికి సినిమాను పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో కేజిఎఫ్ టీమ్ ఉంది.హొంబాళే ఫిలిమ్స్ నిర్మాణ సారధ్యంలో కేజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతోంది.
RAVEENA TANDON FIRST LOOK #KGF2... On #RaveenaTandon's birthday today, Team #KGFChapter2 unveil her look... #KGFChapter2: #RamikaSen... Stars #Yash, #SanjayDutt, #SrinidhiShetty and #RaveenaTandon... Directed by Prashanth Neel... Produced by Vijay Kiragandur. #KGF2 pic.twitter.com/GTj0Kxqx4d
— taran adarsh (@taran_adarsh) October 26, 2020
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు రవీనా టాండన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ చిత్రంలో నటించనున్న ఇతర తారాగణం గురించిన విషయాలు తెలిసిందే. రమికా సేన్ అనే ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలి పాత్రలో రవీనా కనిపించనున్నారు. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రంలోని ఆవిడ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదల కానుంది. ముందు సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నా వచ్చే సమ్మర్ కు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం.