RealStar #SriHari's look as Bheema in #Narthanasala directed and acted by #NandamuriBalakrishna
— Suresh Kondeti (@santoshamsuresh) October 21, 2020
Releasing this 24th on #WorldsFirstATT @ShreyasET , Book your tickets now : https://t.co/VlItpFtERK#NBKOnShreyasET #DasaraWithShreyasET #NBKFilms #ShreyasET pic.twitter.com/PCoWgaHCUz
నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించదలచిన నర్తనశాల మూవీ అర్ధాంతరంగా నిలిచిపోయినా, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. బాలకృష్ణ దర్శకత్వంలోనే నర్తనశాల సినిమా షూటింగ్ మొదలై కొన్ని బలమైన కారణాల వల్ల షూటింగ్ నిలిచిపోయి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత బాలయ్య ఈ సినిమాకోసం అప్పటికే చిత్రీకరించిన ఫుటేజ్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇన్ని సంవత్సరాలు భద్రంగా దాచిన ఈ ఫుటేజ్ ఇప్పుడు ఏటిటి ప్లాట్ ఫామ్ పుణ్యమా అని బయటకు రానుంది. అక్టోబర్ 24న నర్తనశాల సినిమా కోసం చిత్రీకరించిన 17 నిమిషాల ఫుటేజ్ ను విడుదల చేయనున్నారు. ఇందుకోసం 50 రూపాయలు టికెట్ గా నిర్ణయించారు. శ్రేయాస్ ఈటీ యాప్ లో ఈ ఫుటేజ్ విడుదలవుతోంది. ఇప్పటికే బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేసారు. నిన్న అర్జునుడి పాత్రలో నటించిన బాలకృష్ణ లుక్ ను విడుదల చేయగా, ఈరోజు భీముడి పాత్రలో నటించిన శ్రీహరి లుక్ ను విడుదల చేసారు. ఇలా రోజుకొక పాత్ర ఫస్ట్ లుక్ తో ఈ ఫుటేజ్ కు పబ్లిసిటీ తీసుకొస్తున్నారు.