రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు ఒక సంవత్సరం నుండి డేటింగ్ చేస్తున్నారని అనేక ఊహాగానాలు వచ్చాయి. స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వాళ్ళు ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని ఇంకా కోరుకుంటున్నారు.

రష్మిక ఇటీవల తన అభిమానులతో 'ask me anything' సెషన్ తో ఇంటరాక్ట్ అయింది. చాలా మంది తన అందం రహస్యాలు, రాబోయే సినిమాలు మరియు ఆరోగ్య, దినచర్య గురించి చాలా మంది అడిగినప్పటికీ, రష్మిక రిలేషన్స్ గురించి అడిగిన వారు కొద్దిమంది ఉన్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ నటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాను సింగిల్ అని వెల్లడించింది.
"ఇది నాకు తెలిసిన వారందరితో నా పేరు జత పెడుతూనే ఉన్న వారందరికీ ... నేను ఒంటరిగా ఉన్నాను .. నన్ను నేను ప్రేమిస్తున్నాను.. ఇది కూడా నేను ఒంటరిగా ఉండటానికి చుట్టుపక్కల ఉన్న వారందరికీ చెబుతున్నాను.. మీరు సింగిల్ గా ఉండటాన్ని ఎప్పుడైతే ఇష్టపడతారో అప్పుడు మీ లవర్ యొక్క స్టాండర్డ్స్ గురుంచి హై లో ఊహిస్తారు.. " అని చెప్పింది రష్మిక.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో యాక్షన్ థ్రిల్లర్ పుష్పాలో రష్మిక కనిపించనుంది. సుల్తాన్ చిత్రంలో కార్తీతో కూడా ఇంకో సినిమా చేస్తుంది.