రాఘవ లారెన్స్ దక్షిణాది సినిమా రంగంలో.ఈ పేరు తెలియనివారు ఉండరు.
కొరియోగ్రాఫర్ గా,నటుడిగా,దర్శకుడిగా, మానవతావాదిగా అందరికి సుపరిచితుడు.
ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాను అంటున్నాడు. సుపర్ స్టార్ రజనీకాంత్ పార్టీలో చేరబోతున్నట్టు చెప్పాడు.
రజనీకాంత్ తన రాజకీయ పార్టీ గురించి కార్యాచరణ ప్రణాళికను నవంబర్ నెలలో ప్రకటిస్తాడని చెప్పాడు. అలాగే నేను రాజకీయాల్లోకి వస్తే నాకు ఇష్టమైన సేవ కార్యక్రమాలు ఇంకా ప్రజలకి దగ్గరగా తీసుకువెళ్ళవచ్చని చాలామంది స్నేహితులు, శ్రేయోభిలాషులు సూచించారు.
అందుకే ప్రజలని ఎంతగానో ప్రేమించే తత్వమున్న తలైవా రజనీకాంత్ పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నాను అన్నారు. అయితే రాజకీయాలంటే విమర్శలు చేసుకునేది కాదు. ప్రజలకి సేవ చేసేదే నిజమైన రాజకీయం.
నేను అదే చేయడానికి అలాంటి మంచిమనిషి పార్టీలోకి చేరి ప్రజలకి మరింత సేవ చేయలనుకుంటున్నానని తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇలాంటి సేవా తత్పరత కలవారు రాజకీయాల్లోకి వస్తే ఎంతో కొంత పేద ప్రజలకి ఉపయోగంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.